మనవి

మిత్రులారా...

ఈ పద నివేశ స్థలములో పొందు పరచబడిన ఏ కవితా ఎవరిని ఉద్దేశించినది కాదు. ఇందు పొందు పరచబడిన ఒక పదము వల్ల కాని లేక ఒక కవిత వల్ల కాని ఎవరేని హృదయము నొచ్చుకున్నా లేక బాధించబడ్డ వారి యొక్క విమర్శకు నేను సదా వినమ్రుడను కాని బాధ్యుడను కాను.

ఇట్లు
మీ అనిల్ కుమార్ శర్మ చింతలపల్లి

22, మే 2010, శనివారం

ఇదా.. ప్రేమ???

ప్రేమా.. ఇది మిత్రమా.. ప్రేమా...

కాలనాగు కోరల నుండి పుట్టిన కాల కూట విషములా
కోమల కుసుమాల వంటి మోములను కబళించె మండె అరుణ కిరణాలలా
పడతి ని భరణముగా పెట్టే సామంత రాజ్యములా
కన్న హృదయాలను నిట్టనిలువన ముంచు కన్నీటి సంద్రములా
కాసుల కోసం తాకట్టు పెట్టే ఆభరణములా
ఇదా.. ప్రేమ, కాదు మిత్రమా...ఇది ప్రేమ కానే కాదు.
ప్రేమంటే...ఉండాలి...ఇలా
కాలకూట విషాన్ని నిండిన హృదయాన్ని నిర్మలంగా మార్చే విరుగుడులా
కలువ కనుల కోమలి మోమును వికసింపచేయు ఉదయభానుని నులి వెచ్చని స్పర్శలా
పడతికి అందించే జీవిత కాలపు ఆభరణములా
కన్న హృదయాలను కడవరకు కావలి కాచే భరోసాలా
దైనందిన జీవిత సమరంలో గెలుపును అందించే స్పూర్తిలా
ఇది మిత్రమా..ప్రేమంటే..ఇది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి