మనవి

మిత్రులారా...

ఈ పద నివేశ స్థలములో పొందు పరచబడిన ఏ కవితా ఎవరిని ఉద్దేశించినది కాదు. ఇందు పొందు పరచబడిన ఒక పదము వల్ల కాని లేక ఒక కవిత వల్ల కాని ఎవరేని హృదయము నొచ్చుకున్నా లేక బాధించబడ్డ వారి యొక్క విమర్శకు నేను సదా వినమ్రుడను కాని బాధ్యుడను కాను.

ఇట్లు
మీ అనిల్ కుమార్ శర్మ చింతలపల్లి

21, అక్టోబర్ 2010, గురువారం

భరతమాత అవనికే మాతని చూపేదెనాడు???

మతాల మారణకాష్ఠం ఆగేదెనాడు..
భరతజాతికి గ్రహణం విడేదనాడు..
ఈ సమాజ వ్రణం మానేదెనాడు..
మనిషి మతాల ముసుగు తిసేదెనాడు..
భగవంతుడి గుడి హృదయం అని తెలిసేదెనాడు..
జాతి నవ్యగతికి మారేదనాడు..
భరతమాత బిడ్డలమని తలచేదెనాడు..
భరతమాత రక్తాశ్రువులను తుడిచేదేనాడు..
భరతమాత వేదన తిర్చేదెనాడు..
భరతమాత అవనికే మాతని చూపేదెనాడు???
అవనికే మాతని చూపేదెనాడు???

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి