దేవదేవుని సహనాన్ని పోల్చడానికి భుమాత ఉంది
మరి అమ్మ సహనాన్ని పోల్చడానికి ఎముంది నాకు భుమాతను మించి???
దేవ దేవుని హృదయాన్ని పోల్చడానికి ఈ బ్రహ్మాండము ఉంది
మరి అమ్మ హృదయాన్ని పోల్చడానికి ఎముంది నాకు బ్రహ్మాండము మించి???
దేవ దేవుడు ఇచ్చిందానిని పోల్చడానికి ప్రకృతి ఉంది
మరి అమ్మ ఇచ్చేదానిని పోల్చడానికి ఎముంది నాకు ప్రకృతిని మించి???
దేవ దేవుని పోల్చగలను అమ్మను పెట్టి..
అయ్యో..మరి నా బుద్దికి ఏమియ్యలేదే...
అమ్మను పోల్చడానికి దేవ దేవుని మించి???
అమ్మ గుర్తువస్తే రాలే నా ఈకంటి ఆనందభాష్పాలను మించి???
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి