కావాలి ఒకరిపై ఒకరికి ఆధిపత్యం ఎందుకంటే???
మనపై మనకు ఆధిపత్యం లేదు కాబట్టి
కావాలి మనకు ధనంపై ఆధిపత్యం ఎందుకంటే???
సంతృప్తిపై మనకు ఆధిపత్యం లేదు కాబట్టి
కావాలి మనకు మతంపై కులంపై ఆధిపత్యం ఎందుకంటే???
మంచిగా ఉంచే మనస్సుపై మనకు ఆధిపత్యం లేదు కాబట్టి
కావాలి మనకు సమాజంపై ఆధిపత్యం ఎందుకంటే???
మంచిని పెంచె బుద్దిపై మనకు ఆధిపత్యం లేదు కాబట్టి
కావాలి మనకు న్యాయంపై ఆధిపత్యం ఎందుకంటే???
కరకు కత్తిలాంటి సత్యంపై మనకు ఆధిపత్యం లేదుకాబట్టి
కావాలి మనకు హింసపై ఆధిపత్యం ఎందుకంటే???
అజాతశత్రువుగా మార్చే అహింసపై మనకు ఆధిపత్యం లేదు కాబట్టి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి