నీవు లేకున్నా.....
నను ఒంటరితనం వేధించటలా.. ఎందుకంటే???
నీ హృదయం చెప్పిన ఊసులు చెపుతూ..
నీ నిశ్వాస... నా ఉశ్ఛ్వాసగా మారి
నా హృదయాన్ని ఓదారుస్తూంది
నీకోసం తిరిగే నాకు..
నీ దూరం భారం అనిపించటలా.. ఎందుకంటే???
ఇక మారని నీ రూపం నా తలపులలో..
నాతోనే వస్తూ.. నీవెంటే ఉన్నానంటుంది.
కానీ...నీ ఉన్నపుడు..
నీ వెనుక పడతూ..
ఆవేధనగా ఉన్న నాడు..నన్ను ప్రేమికుడన్నారు..
నీవు లేక..
నీ ఉసులతో..నీ తలపులతో
నిను ఆరాధిస్తున్నప్పుడు ..
ఒడ్డును తాకినా గట్టు చెరలేని కెరటం అంటున్నారు
కాని వారికి తెలియదు....
గట్టుకు చెరిన కెరటం ఉప్పెనవుతుందని.
హృదయం ఉప్పెన అయితే అది నన్నే మున్చెస్తుందని.. :-(
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి