తడిఆరిఆరని నీ తలలోన
మరవం నిండిన మల్లేలు పెట్టి..
కలువల లాంటి నీ కనులకు
నల్లని కాటుక పాయగా రాసి..
సప్తమి నాటి చంద్రునిలాంటి నీ నుదిటిన..
ఎర్రని కుంకుమ తిలకము దిద్ది..
సంపంగెల వంటి నీ చేతులకు
చక్కని జిలుగుల గాజులు తొడిగి..
గులాబిలానే నీ పాదాలకు పారణిగా రాసి..
పట్టు పరికిణి చక్కగా కట్టి...
ఉదయభానుడు..
నీ సుందర రూపం చూడక ముందే
చెప్పాలని ఉంది నా శుభాకాంక్షలు..
ప్రతి నీ జన్మదినాన..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి