మనవి

మిత్రులారా...

ఈ పద నివేశ స్థలములో పొందు పరచబడిన ఏ కవితా ఎవరిని ఉద్దేశించినది కాదు. ఇందు పొందు పరచబడిన ఒక పదము వల్ల కాని లేక ఒక కవిత వల్ల కాని ఎవరేని హృదయము నొచ్చుకున్నా లేక బాధించబడ్డ వారి యొక్క విమర్శకు నేను సదా వినమ్రుడను కాని బాధ్యుడను కాను.

ఇట్లు
మీ అనిల్ కుమార్ శర్మ చింతలపల్లి

30, జూన్ 2010, బుధవారం

ప్రేమికుడు???

అన్నారు...
ప్రేమిస్తే కవి కాని వాడికి కూడ కవిత్వం వస్తుందని...
ఎలా వస్తుందో నాకు తెలియడం లేదు ???
ఎందుకంటే నాకు నీ పేరు తప్ప మరో పదమే గుర్తు రావట్లేదు.

చెప్పారు...
పున్నమి రేయిలో చల్లని వెలుగులు చిందించె జాబిలి చుస్తే ప్రేయసి వదనం కనిపిస్తుందని...
కాని గుర్తించలేకుంది నీ రూపం నిండిన నా మస్తిష్కం !!!
వెలుగులు నిండిన పున్నమి రేయి ఎదో... కారుచీకటి కమ్మిన అమావాస్య నిసి ఎదో.

రాసారు...
ప్రేయసి నిండిన హృదయం చేసె సవ్వడి ఆమె పెరే అని...
కాని నాచేవులకు నీవు పలికిన తీయని మాటలుతప్ప మరేమి వినిపించుట లేదు.

తెలిపారు...
ప్రేయసి ప్రియులకు వారిద్దరే లోకంలో ఉన్నట్లుంటుందని..
కాని నాకేంటో నువ్వే లోకమైపోయావు...
నేను ఉన్నట్లు నాకే తెలియట్లేదు...తెలియట్లేదు...తెలియట్లేదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి