యువత కావాలి నీవు...
మాద్యంలో దిక్కు తోచని భారత దేశపు ఆర్ధిక నావ తెరచాపకు గమనాన్ని నిర్ధేశించే గాలివి
ప్రాంతీయ విభేదాలు పెట్టే కుటిల నాయకుల గుండెల్లో దిగే మన్యం బిడ్డ కొమరం భీముని గోడ్డలివి
మత్తున ముంచి చిత్తు చెయాలనే మదమేక్కిన మందు బాబుల నెత్తిపై పిడుగువి
యువత కావాలి నీవు...
మతము చాటున మాటకలిపి మనసును మాలిన్యము చేయు మతాంధుల ఉసురు తీయు ఉత్పతానివి
రాజకీయ ధుర్మధాందుల అవినీతిని దునుమాడేందుకు మహార్షి ధధీచి వెన్నెముకవి
ప్రేమ ముసుగు వెసుకొని కన్నియల ప్రాణాలను హరియించు కామాంధుల కంఠాన్ని ఖండించు ఛత్రపతి ఖఢ్గానివి
యువత కావాలి నీవు...
భారత దేశ తలరాతమార్చ తుది శ్వాస విడిచిన భాగ్యధాతల కలలను పండించు పచ్చని పైరువి
ఎల్లలెరుగక అవని నందు, ఎత్తునెంచక ఆకాశమందు ధగ్ ధగల నీదేశ మువ్వన్నెల పతాకను ఎగరవేయు పుష్పకానివి
యువతా కావాలి నీవు రాజకీయ రచ్చబండనెక్కిన రాళ్ళ మధ్య కాంతిలీను రత్నానివి...యువతా కావాలి నీవు రత్నానివి.
(దధీచి వెన్నెముక అంటే వజ్రాయుధము, పుష్పకము అంటే పూర్వ కాలములో దేవతలు ఉపయోగించే విమానము)
Nice anna....
రిప్లయితొలగించండి