మనవి

మిత్రులారా...

ఈ పద నివేశ స్థలములో పొందు పరచబడిన ఏ కవితా ఎవరిని ఉద్దేశించినది కాదు. ఇందు పొందు పరచబడిన ఒక పదము వల్ల కాని లేక ఒక కవిత వల్ల కాని ఎవరేని హృదయము నొచ్చుకున్నా లేక బాధించబడ్డ వారి యొక్క విమర్శకు నేను సదా వినమ్రుడను కాని బాధ్యుడను కాను.

ఇట్లు
మీ అనిల్ కుమార్ శర్మ చింతలపల్లి

25, ఆగస్టు 2010, బుధవారం

ఐకమత్యమే జాతి బలం

మిత్రమా...నా ప్రియ మిత్రమా
నల్లతోలు కప్పు కున్న కుటిలబుద్ది తెల్ల దొరలు వాళ్ళురా
తెలుగు తల్లి ఖ్యాతి నంతా రచ్చ కీడ్చు జాతి హీనులేనురా
వాళ్ళ మాట నమ్మితే అభివృద్ధే సున్నరా
తెలుగు జాతి చెరువులోని రాజకీయ జలగలురా
నొప్పి తెలియకుండనే జాతి కీర్తి చెరచురా
మంత్రి పదవి ఉన్నదంటే... అభివృద్ధి అంటే ఎంటిరా ???
పదవి ఉడినంతనే ప్రాంతీయతత్వమొచ్చురా
కన్నతల్లి తలభాగం ప్రేమంతా కడచూరి బిడ్డమీదనేనురా
మన తెలుగు తల్లి కడచూరి బిడ్డింకెవరురా..మన ప్రియ తెలంగాణనేనురా.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి