మనవి

మిత్రులారా...

ఈ పద నివేశ స్థలములో పొందు పరచబడిన ఏ కవితా ఎవరిని ఉద్దేశించినది కాదు. ఇందు పొందు పరచబడిన ఒక పదము వల్ల కాని లేక ఒక కవిత వల్ల కాని ఎవరేని హృదయము నొచ్చుకున్నా లేక బాధించబడ్డ వారి యొక్క విమర్శకు నేను సదా వినమ్రుడను కాని బాధ్యుడను కాను.

ఇట్లు
మీ అనిల్ కుమార్ శర్మ చింతలపల్లి

26, ఆగస్టు 2010, గురువారం

శోధన

శోధన..శోధన..శోధన..శోధన..
కామాంధపు స్వాముల ఒడి లో...
అధునికతను అడ్డుగా పెట్టిన అసభ్య సంస్కృతి జడిలో..
కోల్పోతున్న "హైందవ సంస్కృతి" శోధన.

శోధన..శోధన..శోధన..శోధన
ధనానికే దాస్యం చేస్తూ...
సమాజ విలువలకు సమాధి కట్టే..
నవ్యప్రపంచపు జీవన గతిలో "మానవత్వపు" శోధన.

శోధన..శోధన..శోధన..శోధన
మతాలతోటి..కులాలతోటి కాష్ఠం వేసి...
జనాల బ్రతుకులు బుడిద చేస్తూ..
సమానతలకై సాధన చేసే జనాధిపతుల "సామర్ధ్యం" పై శోధన.

శోధన..శోధన..శోధన..శోధన
మూడు పదులలో మాయం అయ్యే...
అందంపైన మోహంతోటి...
అంగడి సరుకుగా మార్చేస్తూన్న "అమ్మ తనపు" శోధన.

శోధన..శోధన..శోధన..శోధన
అమ్మతనాన్ని, నాన్నతనాన్ని..
కాసుల త్రాసులో తూచేసి వృద్ధాశ్రమాలలో జమకట్టేస్తున్న..
తనయుల మదిలో "ఆత్మీయత" కై శోధన.

శోధన..శోధన..శోధన..శోధన
అంతంకాని వాంఛలతోటి..
అదుపే లేని ఆవేశంతోటి..
హత మవుతున్న యువత "మనశ్శాంతి" కై శోధన.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి