మనవి

మిత్రులారా...

ఈ పద నివేశ స్థలములో పొందు పరచబడిన ఏ కవితా ఎవరిని ఉద్దేశించినది కాదు. ఇందు పొందు పరచబడిన ఒక పదము వల్ల కాని లేక ఒక కవిత వల్ల కాని ఎవరేని హృదయము నొచ్చుకున్నా లేక బాధించబడ్డ వారి యొక్క విమర్శకు నేను సదా వినమ్రుడను కాని బాధ్యుడను కాను.

ఇట్లు
మీ అనిల్ కుమార్ శర్మ చింతలపల్లి

1, సెప్టెంబర్ 2010, బుధవారం

ప్రేయసి..అవకాయ..కోపం

ప్రేయసి నీమీద నాకు కోపం వచ్చింది..
అందుకనే అవకాయను అన్నంలో కలుపుకున్నా...
ఆ కోపం ఇంకా పెరగాలని...

కాని... కోపంలో ముడుచుకొనే నీకను బొమ్మలు..
నన్ను కోప్పడాలని ఉన్న కోప్పడలేని నీ అదిరే అధరాలు గుర్తురాగానే...
నా మనస్సును ఆనందం ఆవహించింది.

దాంతో అవకాయ అన్నాన్ని నెయ్యొచ్చి ముద్దాడింది.
నా జిహ్వకు ఆత్రుత పెరిగింది ఇలా... (జిహ్వ అంటే రుచిని కోరె నాలుక)
నీవిస్తానన్నప్పుడు ముద్దు కోసం ఎదురు చూసే అమాయకపు బుగ్గలా...

అవకాయ ముద్ద అందుకున్న...నా జిహ్వ అయిందీ !!!!
ముద్దువ్వటానికి వచ్చే నీకు..ఎదురు ముద్దు నెనే ఇచ్చినపుడు...
చిరు కోపంతో నీ మోమున మెరిసే నవ్వులా... :)

(ఈ ఉహ నిచ్చిన నా అవకాయకు..నా దోరకాగిన నెయ్యికి నా కృతఙ్ఞాభివందనాలు)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి