మనవి

మిత్రులారా...

ఈ పద నివేశ స్థలములో పొందు పరచబడిన ఏ కవితా ఎవరిని ఉద్దేశించినది కాదు. ఇందు పొందు పరచబడిన ఒక పదము వల్ల కాని లేక ఒక కవిత వల్ల కాని ఎవరేని హృదయము నొచ్చుకున్నా లేక బాధించబడ్డ వారి యొక్క విమర్శకు నేను సదా వినమ్రుడను కాని బాధ్యుడను కాను.

ఇట్లు
మీ అనిల్ కుమార్ శర్మ చింతలపల్లి

3, సెప్టెంబర్ 2010, శుక్రవారం

అంతర్మధనం

నాదీ అని నాలో నిద్రలేస్తున్నఈ ఊహను ఊహించడానికి ఊహనిచ్చి..
ఈ ఊహ నీ ఊహ కాదు నాఊహ అనని ఆ ఊహ ఎవరు???

నాదే ఈ శక్తి అంతా అని రంకెలేస్తుండటానికి శక్తినిచ్చి..
నాదీ ఈ శక్తి అనని ఆ శక్తి ఎవరు???

ప్రకృతి మర్మాలని కనిపెట్టి నెనే లోకానికి కాబొయే అధిపతినని విర్రవీగుతున్న..
ఈ మర్మమూ..నామర్మమేనని అనని ఆ మర్మమేవరు???

కనిపించే నెనే అంతా అనిపించే..
ఆ కనిపించని నేను.. అనని ఆ నేను ఎవరు????


ఎంటీ కొద్దిగా తికమకగా ఉందా??? ఐతే క్రింద భావంతో ఉంది చూడండి బాగ అర్ధం అవుతుంది. :)

నాదీ అని నాలో నిద్రలేస్తున్నఈ ఊహను ఊహించడానికి ఊహనిచ్చి...
ఈ ఊహ నీ ఊహ కాదు నాఊహ అనని ఆ ఊహ ఎవరు???
భావం: నెనే ఉహిస్తున్ననాను నా మనస్సుకే తడుతున్నాయి... అనుకొనే ఈ ఊహలన్నింటిని ఉహించటానికి కారణం అయినటువంటి నాకు తెలియని.. నెనే అని నాకు చెప్పని ఆ ప్రేరణ(ఉహ) ఎవరు????

నాదే ఈ శక్తి అంతా అని రంకెలేస్తుండటానికి శక్తినిచ్చి..
నాదీ ఈ శక్తి అనని ఆ శక్తి ఎవరు???
భావం: నేను ఎదైన చెసెయగలను..నేను అనుకొంటే చాలు అనుకొనే గుండె నిబ్బరం అనే శక్తి నాలో ఎక్కడి నుండి వచ్చింది...ఎవరిచ్చారు ఇచ్చికూడ నేను ఇచ్చాను అనని ఆ శక్తి పేరెమిటి???

ప్రకృతి మర్మాలని కనిపెట్టి నెనే లోకానికి కాబొయే అధిపతినని విర్రవీగుతున్న..
ఈ మర్మమూ..నామర్మమేనని అనని ఆ మర్మమేవరు???
భావం: నేను ప్రకృతి రహస్యాలను (మర్మము అంటే రహస్యము) తెలుసుకొంటున్నానని సంబరపడుతున్నాను కాని అసలు నేను ఎవరు..నన్ను తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు...వాళ్ళని తీసుకొచ్చింది ఎవరు ??? ఈ గొలుసుని నడిపిస్తున్న నేను అనని ఆ రహస్యం ఎమిటి? ఎవరు???

కనిపించే నెనే అంతా అనిపించే..
ఆ కనిపించని నేను.. అనని ఆ నేను ఎవరు????
భావం: ఇంతా అలోచిస్తూ ఇదంతా నెనే కదా అనుకొంటున్నానే...అలా అనుకోవటానికి నేను ఎవరు...నాలో నేను అని చెప్పకుండా ఉండి నాచేత చెప్పించేది ఎవరు???

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి