రెప్పల మాటున కన్నులలా...
హృదయం లోని స్పందనలా...
కదలికలలోని హావంలా...
మాటలలోని భావంలా...
కష్టాలను ఇష్టంగా భరించే ధైర్యంలా..
అపజయాలని గెలుపుగా మార్చుకొను స్పూర్తిలా...
ఓర్పుతో కోపం రూపం మార్చు మార్పులా...
పూర్ణ హల్లులను చెసే ప్రాణ్యక్షరాలలా... (ప్రాణ్యక్షరాలు అంటే అచ్చులు)
ముందు వెనుకల భేదము చూడని అభేదములా..
వెన్నంటే నీడలా...
ఊపిరికి శ్వాశలా...
నేను నువ్వులా..నువ్వు నేనులా...
వాడి పోని జీవిత పుష్పములో..
మకరందము గ్రోలు తుమ్మెదలలా...
కలసి భాద్యతలన్ని మొసేద్దాం..
మన జీవితపుటంచులు దాటేద్దాం..
అనంత గగనంలోకి ఎగిరేద్దాం... అనంత గగనంలోకి ఎగిరేద్దాం.
భావం
రెప్పల మాటున ఉండె కనులలా ఒకరి వెనుక ఒకరు ఉండి, ఒకరి హృదయస్పందన ఒకరుగా మసులుకుంటూ, ఒకరిని కదలికలను బట్టి ఒకరు అర్ధం చేసుకుంటూ, ఒకరి మాటకు మరొకరు భావంగా ఉండేంత మమేకమై...
కష్టాలలో ఒకరికొకరు ధైర్యం చెప్పుకొంటూ, అపజయాలు కలిగినపుడు ఒకరికి ఒకరు స్పుర్తినిచ్చుకొంటూ, ఒకరికి కోపం వచ్చినపుడు ఇంకొకరు ఒర్పుతో మసలుకొంటూ, అచ్చుతో కలసి పూర్తి అయిన హల్లు మదిరిగా ఇద్దరూ కలసిపోయి...
ఒకరెక్కువ ఒకరు తక్కువ అని భేదము లేకుండా, ఒకొరికొకరు నీడలా, శ్వాశలా, నువ్వంటే నేనని నేనంటే నువ్వు అని తలపోస్తూ...
పుష్పములోని తేనెను ఆస్వాదిస్తూ తుమ్మెద ఎంత ఆనందంగా ఉంటుందో అదేవిధంగా ఒకరికిఒకరుగా కలసి జీవితంలోని అన్ని భాద్యతలను సంతోషంతో పూర్తి చెసుకొని జీవిత చరమాంకంలో ఆనంత విశ్వంలో కలసిపోవాలని నా హృదయస్పందన.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి